రైతు వేదికలో రైతులకు శిక్షణ
MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో రైతులకు సాగు పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. భూసారాన్ని కాపాడుకుంటూ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ప్రతాపరెడ్డి రైతులకు సూచించారు. పచ్చిరొట్ట పంటల సాగుతో భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏవో గంగమల్లు పాల్గొన్నారు.