రేపు నంద్యాలలో జాబ్ మేళా

రేపు నంద్యాలలో జాబ్ మేళా

NDL: నంద్యాలలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి(DSDO) శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ ప్రైవేట్ లిమిటెడ్, మనపురం ఫైనాన్స్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు.