డుంబ్రిగూడ పరిధిలో రోడ్డు భద్రత చర్యలు

డుంబ్రిగూడ పరిధిలో రోడ్డు భద్రత చర్యలు

ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే 516 పై సిగ్నల్, కాషన్ బోర్డులను గమనించాలని వాహనదారులకు సూచించారు. డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లాపుట్టు, ఆంత్రిగూడ, నారింజవలస మలుపుల వద్ద “GO SLOW” బోర్డులు ఏర్పాటు చేశారు. మలుపుల వద్ద నెమ్మదిగా వాహనాలు నడిపి జాగ్రత్తలు పాటించాలని కోరారు.