ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేయాలి: విశ్వనాధ్
ASF: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుడ్మేత విశ్వనాధ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. పత్తి పంటకు 12 శాతం, మొక్క జొన్నకు 14 శాతం తేమ మించకుండా విక్రయించేందుకు తీసుకువస్తే ప్రభుత్వ నిర్ణిత ధర చెల్లించడం జరుగుతుందని సూచించారు.