VIDEO: రాచర్ల మండలంలో భారీ వర్షం

VIDEO: రాచర్ల మండలంలో భారీ వర్షం

ప్రకాశం: రాచర్ల మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా వాతావరణం మార్పు చోటుచేసుకొని ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.