జోహ్రాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
US: న్యూయార్క్ మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్‌దానీ ఎన్నికైన విషయం తెలిసిందే. జోహ్రాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక కమ్యూనిస్ట్ అని, ఆయన విజయంతో న్యూయార్క్ కమ్యూనిస్ట్ క్యూబా లేదా సోషలిస్ట్ వెనిజులాగా మారిపోతుందని ఆరోపించారు. దీంతో న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు.