దేవీ నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట

KKD: కోటనందూరు మండలం కొత్తకొట్టాంలో నిర్వహించనున్న దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శనివారం పందిరి రాట కార్యక్రమం జరిగింది. దుర్గాదేవీ అమ్మవారి పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు శుభప్రదంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని స్థానిక యువత తెలిపారు.