పేరెంట్, టీచర్ మీటింగ్ అంటే నాకు భయం: లోకేష్
AP: మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరెంట్- టీచర్ మీటింగ్‌కి చంద్రబాబు అస్సలు వచ్చేవారు కాదని చెప్పారు. చిన్నప్పుడు పేరెంట్, టీచర్ మీటింగ్ అంటే తనకు భయం వేసేదని అన్నారు. తనది అంతా ఒక అల్లరి బ్యాచ్ ఉండేదని తెలిపారు. అలాగే, తాను మాత్రం ఎన్ని పనులున్నా దేవాన్ష్ పేరెంట్, టీచర్ మీటింగ్‌కి తప్పకుండా వెళ్తానని వెల్లడించారు.