ఏటూరునాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

ఏటూరునాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

MLG: ఏటూరు నాగారం మండలం మానసపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కొయ్యల కృష్ణవేణి, కాళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను స్మరించారు. గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.