నూతన పోలీస్ ఔట్‌పోస్ట్ ప్రారంభం

నూతన పోలీస్ ఔట్‌పోస్ట్ ప్రారంభం

VSP: దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తూ, జ్ఞానాపురంలో నూతన పోలీస్ ఔట్‌పోస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు దూరంగా ఉన్న గ్రామస్తులకు ఇకపై రక్షణ, ఫిర్యాదుల నమోదు సులభతరం కానుంది. ఈ కార్యక్రమాన్ని పునీత పేతురు దేవాలయం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ చేతుల మీదుగా, విశాఖ జోన్ ఏసీపీ పృధ్వీ తేజ అధ్యక్షతన నిర్వహించారు.