వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు

వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో పెళ్లిళ్ల వెంకన్న‌గా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొని కళ్యాణం వీక్షించారు.