గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

CTR: పుంగనూరు మండలం వనమలదిన్నె కుమ్మరిగుంట గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటేశ్ బైకు మీద వెళుతుండగా మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన త్రీవంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు.