'పోడు భూములను తీసుకోవడం దారుణం'
MLG: కన్నాయిగూడెం మండలం మల్కపల్లి గ్రామంలో గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను ఆదివారం ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా టీఎజీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్ మాట్లాడుతూ.. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా, అధికారులతో లాక్కోవడం ప్రభుత్వ విధానమని, దీనిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.