రన్నింగ్ ట్రైన్‌లో ప్రయాణికురాలిపై అత్యాచారం

రన్నింగ్ ట్రైన్‌లో ప్రయాణికురాలిపై అత్యాచారం

AP: గుంటూరు నుంచి చర్లపల్లి వెళ్తున్న సంత్రగాచి స్పెషల్ ట్రైన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. బోగీలో ఒంటరిగా ఉన్న మహిళను ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ట్రైన్ గుంటూరు దాటిన తర్వాత ఈ ఘటన జరగ్గా నిందితుడు పెదకూరపాడులో దిగిపోయాడు. బాధితురాలు సికింద్రాబాద్ GRP పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసును నడికుడి GRP పోలీసులకు బదిలీ చేశారు.