మల్దకల్‌లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం

మల్దకల్‌లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం

GDWL: గద్వాల నియోజకవర్గ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, పాల్వాయి, మల్లెం దొడ్డి, విఠలాపురం గ్రామాలలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా, ఐక్యతతో పనిచేస్తేనే గ్రామం ప్రగతి బాట పడుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందుతానే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.