VIRAL: యోగాసనాలతో అలరించిన బాలిక

AP: తిరుమల శ్రీవారి ఆలయం ముందు యోగాసనాలు వేస్తూ ఓ బాలిక అందరినీ ఆకర్షించింది. కాకినాడకు చెందిన రేఖాడి చైత్ర జివాస్కి తన తల్లిదండ్రులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లింది. దర్శనం అనంతరం ఆలయం ఎదుట వివిధ యోగాసనాలు వేయడంతో పలువురు భక్తులు ఆశ్చర్యంగా తిలకించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.