'ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ జయప్రదం చేయాలి'
NZB: ఈ నెల 26, 27, 28 తేదీల్లో NZBలో జరిగే SFI రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా గర్ల్స్ కన్వీనర్ దీపిక ఆదివారం పిలుపునిచ్చారు. నగరంలోని నాందేవాడలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆమె కన్వెన్షన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.