కంచికచర్ల గ్యాస్ ఏజెన్సీలో జేసీ ఆకస్మిక తనిఖీ

కంచికచర్ల గ్యాస్ ఏజెన్సీలో జేసీ ఆకస్మిక తనిఖీ

NTR: కంచికచర్లలోని రాజ్యలక్ష్మీ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని బుధవారం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తనిఖీ చేశారు. సాధారణంగా మూసివేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే మూసివేయలేదన్నారు. అయితే ఏజెన్సీపై పెనాల్టీ విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. మళ్లీ ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.