కొవ్వూరు ఆర్డీవోగా ఆనందరావు బాధ్యతలు

కొవ్వూరు ఆర్డీవోగా ఆనందరావు బాధ్యతలు

E.G: కొవ్వూరులో ఆర్డీవోగా కే. ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై రెవెన్యూ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని, భూవివాదాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.