పనికి వెళ్లమన్నారని.. ఆత్మహత్య..!

పనికి వెళ్లమన్నారని.. ఆత్మహత్య..!

NGKL: తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌కు చెందిన కుంభం విగ్నేశ్(20)‌ను పొలం పనులకు వెళ్లాలని తండ్రి గదమాయించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం HYDకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.