చెన్నెలో మెరిసిన మెదక్ నృత్యకారులు

చెన్నెలో మెరిసిన మెదక్ నృత్యకారులు

SGR: చెన్నైలో జరిగిన అంతర్జాతీయ నృత్యోత్సవంలో మెదక్‌కు చెందిన నృత్య కారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మంగళవారం రోజున ఈ ఉత్సవంలో పాల్గొన్న నృత్య గురువు నివేదితను 'నాట్యరత్న' అవార్డుతో సత్కరించారు. అలాగే, ఆమె శిష్యులైన అద్వైత్ , శ్రీహర్షిణి, అనీక్ష, మృణాళిని, యశశ్రీలకు 'లాస్య జ్వాల' అవార్డు లభించింది.