కళ్లజోడు మచ్చలు తగ్గాలంటే..?
అదేపనిగా కళ్లజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కుపై మచ్చలు ఏర్పడుతాయి. కొన్ని చిట్కాలతో ఆ మచ్చలను తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరాదోస లేదా కీరాదోస రసానికి బంగాళాదుంప, టమాటా రసం కల్పి మచ్చలు ఉన్న చోట రాసి.. ఆరిపోయాక క్లీన్ చేసుకోవాలి. నారింజ తొక్కల పొడి, పాలు, పెరుగు వంటి వాటితో సమస్యను తగ్గించుకోవచ్చు.