గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే జారే

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే జారే

BDK: అశ్వారావుపేట మండలంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ మండల వ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీలను సందర్శించారు. ప్రతి గ్రామంలో జరిగిన ప్రత్యేక సమావేశాలలో ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఎన్నికలలో విజయం కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన వ్యూహాలను వివరించారు.