హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
VSP: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం జబ్బర్ తోటలోని యూపీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయడం ద్వారా సర్వికల్ క్యాన్సర్‌ను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.