భూ భారతి పోర్టల్‌ అవగాహన సదస్సులో మంత్రి

భూ భారతి పోర్టల్‌ అవగాహన సదస్సులో మంత్రి

VKB: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి, కలెక్టర్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.