ఆదివాసీలకు ప్రత్యేక DSC నిర్వహించండి: ATA

VZM: 2025 DSCలో GO నెంబరు 3ని రద్దు చేయడంతో గిరిజన అభ్యర్దులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ATA (ఆదివాసి టీచర్స్ అసోసియేషన్) ఆరోపించింది. ఈ మేరకు సోమవారం గుమ్మలక్ష్మీపురంలో ATA సభ్యులు మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నోటిఫైడ్ చేసిన 881 పోస్టుల్లో గిరిజనులకు 80 కూడా లేవని, ప్రభుత్వం స్పందించి గిరిజన నిరుద్యోగులకు ఈ DSCలో న్యాయం చేయాలన్నారు.