'కాంగ్రెస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు'
SRCL: అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోని అన్నారు. తంగళ్ళపల్లిలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పక్కన లీడర్లు చిట్టీలు అందిస్తే కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మా నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.