డబుల్ ఓట్ల ఆరోపణ ఎంపీపై ఫిర్యాదు
MHBD: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్యపై డబుల్ ఓట్ల ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ఉన్న ఆమె, తొర్రూరులో కూడా ఎక్స్ అఫిషియోగా నమోదు చేయించుకున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.