పదవ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు

పదవ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు

మన్యం జిల్లాలో పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు పబ్లిక్ పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నెల 2 నుంచి 12 వరకు రోజూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులకు ఇవి తుది సాధనగా ఉపయోగపడనున్నాయి. ప్రశ్నపత్రాలను పరీక్షకు గంట ముందు ఎంఈవో కార్యాలయాల నుంచి తీసుకురావాలని అధికారులు సూచించారు.