స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి

స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి

AKP: మునగపాక మండలం తిమ్మరాజుపేటలో విషాదం చోటుచేసుకుంది. డావెన్సీ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న మోక్షిత్(6) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. అయితే, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.