VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

MDK: తూప్రాన్ పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలలో గణపతి పూజ, స్వస్తి వాచనం, దేవతాహ్వానం, శ్రీ గోపాలకృష్ణ స్వామికి అష్టాదశ ద్రవ్యములు, మహాభిషేకం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.