VIDEO: 'ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు'

TPT: పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి మంగళ వాయిద్యాలతో యాలి వాహనంపై శివపార్వతులను పట్టణంలోని కాపువీధి, బజారు విధులలో ఊరేగించారు. భక్తులు దారి పొడవునా కర్పూర హారతులు సమర్పించారు.