బ్రాహ్మణచెరువులో ఫ్రైడే- డ్రైడే' కార్యక్రమం
WG: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామంలో శుక్రవారం 'ఫ్రైడే -డ్రైడే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. నిల్వ నీటిలో దోమల వ్యాప్తిని గుర్తించి, వాటి ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేల్ అసిస్టెంట్ నాగభూషణం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.