తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్..

NZB:జిల్లాలో 9 మంది కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లగా ప్రమోషన్ లభించింది. తెలంగాణ రాష్ట్ర డీజేపీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రమోషన్లు పొందిన కానిస్టేబుళ్లు సీపీ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతకాలంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు లభించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.