VIDEO: ఎకో పార్క్‌ను ప్రారంభించిన సీఎం

VIDEO: ఎకో పార్క్‌ను ప్రారంభించిన సీఎం

RR: శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కొత్వాల్ గూడలో నిర్మించిన ఎకో పార్కును సీఎం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మొక్కకు నీళ్లు పోసిన అనంతరం బ్యాటరీ వాహనంలో ప్రయాణిస్తూ పార్కును పరిశీలించారు. కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.