విజయవాడలో వైసీపీ మహిళ నేతలు నిరసన

ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడికి నిరసనగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైసీపీ మహిళా విభాగం, బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ దాడిలో పాల్గొన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.