VIDEO: రాజమండ్రిలో సందడి చేసిన అడవి శేష్
E.G: 'డేకాయిట్' మూవీ విజయ యాత్రలో భాగంగా నటుడు అడవి శేష్ గురువారం రాజమండ్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్లో 'డేకాయిట్' మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.