పునాదిపాడులో ఏర్పాటు చేయనున్న వడ్డె ఓబన్న విగ్రహం
కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడులో రేనాటి ధీరుడు, వడ్డెర కులదైవం వడ్డె ఓబన్న విగ్రహాన్ని జనవరి 11న ఆవిష్కరించనున్నారు. జిల్లాలోనే మొదటిసారిగా ప్రతిష్ఠాత్మకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడైన ఓబన్న,1846 అక్టోబర్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వీర మరణం పోందాడు.