నల్లమల్ల అటవీ ప్రాంతంలో తప్పిన పెను ప్రమాదం

నల్లమల్ల అటవీ ప్రాంతంలో తప్పిన పెను ప్రమాదం

ప్రకాశం: గిద్దలూరులోని నల్లమల అటవీ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న స్పిరిట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, స్పిరిట్ లారీ వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.