పోలింగ్ బూత్‌ ముందు కొబ్బరికాయ కొట్టిన సర్పంచ్ అభ్యర్థి

పోలింగ్ బూత్‌ ముందు కొబ్బరికాయ కొట్టిన సర్పంచ్ అభ్యర్థి

సూర్యాపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కోదాడ నియోజకవర్గం ద్వారాకుంటలో ఓ సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి ఓటేశాడు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న బూత్‌ ముందు కొబ్బరికాయ కొట్టి, దండం పెట్టి, లోపలికి వెళ్లి ఓటేశాడు. కాగా మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఇలా చేసినట్లు అతడు పేర్కొన్నాడు.