మున్సిపల్ కమిషనర్ ప్రకటనకు వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేకు వినతి

NGKL: గృహ నిర్మాణ అనుమతుల ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయంపై మున్సిపల్ కమిషనర్ హెచ్చరికను తాము స్వాగతిస్తున్నామని ప్లానర్స్ అసోసియేషన్ పేర్కొంది. అయితే ఆ ప్రకటనలో బిల్డింగ్ ప్లానర్లను కూడా మధ్యవర్తులతో సమానంగా పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యవర్తులతో ప్లానర్లను పోల్చుతూ ప్రకటన విడుదల చేయడాన్ని ఖండిస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వినతి చేశారు.