ఊరు కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ఉప సర్పంచ్‌గా మారింది
NLG: శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన బండారు రిషిత గ్రామ అభివృద్ధి కోసం తన కెరీర్‌ను సైతం వదులుకుంది. 22ఏళ్లకే బీటెక్ పూర్తి చేసి మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించింది. అయినప్పటికీ ఊరుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో గ్రామ ప్రజలు, BJP, BRS నాయకులు కలిసి ఆమెను ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.