సామర్లకోట మున్సిపల్ చైర్మన్ రాజీనామా

సామర్లకోట మున్సిపల్ చైర్మన్ రాజీనామా

SKLM: సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి తన చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం 9గంటలకు మున్సిపల్ కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అనిశెట్టి శ్రీవిద్యకు అందజేశారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ సీటుకు పై భాగంలో ఉన్న దేశ నాయకుల చిత్రపటాలకు ఆమె గౌరవ వందనం చేశారు.