ప్రశాంతంగా ముగిసిన జీవశాస్త్ర పరీక్ష
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన పదో తరగతి జీవశాస్త్ర పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఈరోజు డీఈవో అశోక్ తెలిపారు. మొత్తం 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,364 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,348 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.