భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి : ఎమ్మెల్యే

KMM: భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి ప్రజలను కోరారు. కరెంట్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లను తాకవద్దని, మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకుని నడవాలని సూచించారు. ఉదృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దన్నారు. వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.