బస్టాండ్‌ను సందర్శించిన సీపీ
KMM: టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్టీసీ నూతన బస్టాండ్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సదర్శించారు. స్థానిక పరిస్థితులపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. బందోస్తులో ఉన్న పోలీస్, అధికారులు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనన్నారు.