తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు
MBNR: నవాబుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఖుష్బు గుప్తా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది గైర్హాజరు, విధుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో భోజన సౌకర్యాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను పరిశీలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.