VIDEO: ప్రమాదకరంగా కల్వర్టు
NLG: మండలంలోని కొత్తపల్లి ముత్యాలమ్మ చెరువు దగ్గర రహదారిపై నిర్మించిన కల్వర్టు మూలమలుపు వద్ద ప్రమాదకరంగా ఉంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి, కల్వర్టుకు ఇరువైపులా సైడ్ వాల్స్ నిర్మించి, మూలమలుపు కనబడకుండా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.