రాజుపేట వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు

AKP: నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మాకవరపాలెం మండలం రాజుపేట వద్ద కొత్తగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణ ఆదివారం తెలిపారు. అలాగే చిక్కుడుపాలెం వద్ద కొత్తగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్న వారంతా మార్కెట్ కమిటీ కార్యదర్శి నుంచి ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాలన్నారు.