కోలాహలంగా గంగమ్మ తల్లి గ్రామోత్సవం

కోలాహలంగా గంగమ్మ తల్లి గ్రామోత్సవం

TPT: విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని గూడూరు రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. రాత్రి ప్రారంభమైన గంగమ్మతల్లి ఉత్సవం తెల్లవారుజాము వరకూ కొనసాగింది. గంగమ్మ తల్లి ఉత్సవం వద్ద భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. సేలం డప్పు వాయిద్య బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.